కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. కింగ్స్ విసిరిన 224 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్ సాధించి మరో విక్టరీని ఖాతాలో వేసుకుంది.
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మొదట బ్యాటింగ్ అప్పచెప్పాడు.
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 46 బంతుల్లో సెంచరీ సాధించి ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.
రాహుల్, మయాంక్‌లు రాజస్తాన్ రాయల్స్‌కు చుక్కలు చూపించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు.
కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది.
ఓపెనర్ జోస్ బట్లర్(4) విఫలమైనా, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్‌ల జోడి 81 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.
9 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 100 పరుగుల మార్కును దాటింది.
ఈ మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్ తెవాతియా. కాట్రెల్ వేసిన 18వ ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి గేమ్‌ను ఛేంజ్ చేసేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆడిన ఆ ఓవర్ కింగ్స్‌కు విజయాన్ని దూరం చేసింది.
ఆఖర్లో ఆర్చర్ (13 నాటౌట్) 3 బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టడంతో రాజస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.