హైదరాబాద్ తమ ముందుంచిన 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ 18 ఓవర్లలో అధిగమించారు కోల్‌కతా బ్యాట్స్ మెన్. ఐపీఎల్ 2020 లో ఎనిమిదో మ్యాచ్ హైలైట్స్..
ఐపీఎల్ 2020 ఎనిమిదో మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు కోల్కతా జట్టు తో తలపడింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది
మొదటి నాలుగు ఓవర్లలో 24 పరుగులు చేసి బెయిర్ స్టో వికెట్ కోల్పోయింది హైదరాబాద్ జట్టు
వరున్ చక్రవర్తి వేసిన 10వ ఓవర్ తొలి బంతికే డేవిడ్ వార్నర్(36) ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్ 59 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 10 ఓవర్లకు ఆ హైదరాబాద్ స్కోర్ 61/2
17 వ ఓవర్లో మనీష్ పాండే తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తమ్మీద 20 ఓవర్లు పూర్తయే సరికి హైదరాబాద్ 142 పరుగులు మాత్రమె చేయగలిగింది.
రాణా చెలరేగిపోయాడు నాలుగో ఓవర్లో. ఖలీల్ బౌలింగ్‌లో వరుసగా మూడు బౌండరీలు సాధించాడు. దీంతో ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు కోల్‌కతా 38/1
కీలకమైన 8,9,10 ఓవర్లో వరుసగా 5,7,5 పరుగులు చేసింది కోల్‌కతా. 10 ఓవర్లు పూర్తి అయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేశారు కోల్‌కతా బ్యాట్స్ మెన్.
13వ ఓవర్‌లో శుభ్‌మన్‌గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోల్‌కతా స్కోర్ 97/3కి చేరింది.
ఆడుతూ పాడుతూ గిల్.. మోర్గాన్ ఇదరూ కలసి కోల్‌కతాను రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేర్చారు.