IPL 2020: MI vs KKR Highlights

ఐపీఎల్ 2020 మ్యాచ్ 5 ముంబాయి ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబాయి 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IPL 2020: MI vs KKR Highlights
టాస్ గెలిచిన కోల్ కతా సారధి దినేష్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ తో కలసి కదం తొక్కాడు. 28 బంతుల్లో 47 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.
హార్దిక్‌ పాండ్యా 18 పరుగులు చేసి రసెల్ బౌలింగ్ లో హిట్‌ వికెట్ గా అవుటయ్యాడు
కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఆరు సిక్స్ లు..మూడు బౌండరీలతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు
ముంబయి ఇండియన్స్ జోరుకు కోల్ కతా ఏదశలోనూ సమాధానం చెప్పలేకపోయింది.
పొలార్డ్‌ 2015 తర్వాత లీగ్‌లో తొలి వికెట్ తీశాడు. 12 వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన రాణా హార్దిక్‌ చేతికి చిక్కడంతో ఈ వికెట్ పోలార్డ్ కు దక్కింది.
16 వ ఓవర్లో బుమ్రా ఒకే ఓవర్‌లో రసెల్‌ (11), మోర్గాన్‌ (16)ను పెవిలియన్‌కు పంపించడం తో కోల్ కతా కథ చివరికి వచ్చేసింది.
బ్యాటింగ్..బౌలింగ్.. ఫీల్డింగ్ ఇలా అదరగొట్టి తన ఆల్రౌండ్ ప్రతిభతో ముంబయి జట్టు కోల్ కతా పై ఘన విజయం సాధించింది