పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ.. అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది!
హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ చేయడానికి నిర్ణయించాడు.
ఊపు మీద ఉన్న వార్నర్ (45)‌ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు హైదరాబాద్ 82/1
అమిత్ మిశ్రా బౌలింగ్‌లో మనీష్‌ (3) భారీ షాట్‌కు యత్నించి రబాడ చేతికి చిక్కాడు. 12 ఓవర్లకు హైదరాబాద్ 94/2
రబాడ వేసిన 18వ ఓవర్‌లో జానీ బెయిర్‌స్టో అర్ధశతకం సాధించాడు. వెంటనే భారీ షాట్‌ ఆడబోయి నోర్జే చేతికి చిక్కాడు. దీంతో హైదరాబాద్‌ 144 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది.
రబాడ వేసిన 20వ ఓవర్‌లో విలియ్సన్‌(41) భారీ షాట్‌ ఆడి బౌండరీ వద్ద అక్షర్‌ పటేల్‌ చేతికి చిక్కాడు. దీంతో హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
163 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు మొదటి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌ పృథ్వీషా(2) ఔటయ్యాడు.
రషీద్‌ ఖాన్‌ వేసిన 8వ ఓవర్‌ రెండో బంతికి శ్రేయస్‌ అయ్యర్‌(17) భారీ షాట్‌ ఆడబోయి అబ్దుల్‌ సమద్‌కు చిక్కాడు. 10 ఓవర్లకు ఢిల్లీ 54/2
రషీద్‌ఖాన్‌ వేసిన 12వ ఓవర్‌లో ధావన్‌(34) ఔటయ్యాడు. కీపర్‌ చేతికి చిక్కి వెనుతిరిగాడు. దీంతో 12 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 63/3
భువనేశ్వర్‌ వేసిన 16వ ఓవర్‌ తొలి బంతికి హెట్‌మైయిర్‌(21) ఔటయ్యాడు. అతడు భారీ షాట్‌ ఆడి మనీష్‌ పాండే చేతికి చిక్కాడు.
నటరాజన్‌ వేసిన 18వ ఓవర్‌లో ఏడు పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. చివరి బంతికి మార్కస్‌ స్టోయినిస్‌(11) ఎల్బీగా వెనుతిరిగాడు.
ఖలీల్‌ అహ్మద్‌ వేసిన చివరి ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌(5) ఔటయ్యాడు. దీంతో దిల్లీ 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. హైదరాబాద్‌ 15 పరుగులతో విజయం సాధించింది.