రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్ని తెగ అలరించింది. సూపర్ ఓవర్ వరకూ సాగిన ఈ మ్యాచ్ లో బెంగళూరు విజయం సాధించింది.
టాస్.. ముంబాయి టాస్ గెలిచి బెంగళూరు కు బ్యాటింగ్ అప్పచెప్పింది.
ఆరోన్ ఫించ్ 31 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. మరోవైపు దేవ్‌దత్ పడిక్కల్(17) అతడికి మంచిగా సహకరించాడు. దీంతో వీరిద్దరూ 8 ఓవర్లకు 74 పరుగులు చేశారు.
16 వ ఓవర్లో పొలార్డ్ వేసిన రెండో బంతిని పడిక్కల్ బౌండరీ సాధించి అర్ధశతకం అందుకున్నాడు. 16 ఓవర్లకు బెంగళూరు 136/2
బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో బెంగళూరు 17 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్లో డివిలియర్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 181/3
చివరి ఓవర్లో దూబే మూడు సిక్స్లు బాదాడు.. తానాడిన పది బంతులకు 27 పరుగులు చేశాడు. దీంతో ముంబాయి ముందు 202 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది బెంగళూరు.
ముంబయికి ఆదిలోనే షాక్ తగిలింది. 2వ ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ(8).. మూడో ఓవర్ రెండో బంతికే సూర్యకుమార్(0) ఔటయ్యాడు. దీంతో ముంబయి 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
14వ ఓవర్‌లో ఇషాన్ కిషన్(52) అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లకు ముంబయి స్కోర్ 112/4గా నమోదైంది.
17వ ఓవర్లో పొలార్డ్(38) రెచ్చిపోయాడు. ఈ ఓవర్‌లో మొత్తం 27 పరుగులు తీశాడు. వరుసగా 4 ,6, 6, 2, 6, 3 బాదడంతో ముంబయి స్కోర్ 149/4కి చేరింది.
18వ ఓవర్‌లలో ముంబయి 22 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్‌లో పొలార్డ్ రెండు సిక్సర్లు .. ఇషాన్ కిషన్ ఒక సిక్సర్ కొట్టారు. దీంతో 18 ఓవర్లకు ముంబయి స్కోర్ 171/4గా నమోదైంది.
ఉదానా వేసిన చివరి ఓవర్లో ముంబాయి 18 పరుగులు చేసింది. దీంతో స్కోర్లు సమానం అయ్యాయి. సూపర్ ఓవర్ లో ఫలితం తేలింది. బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది.