ఐపీఎల్ 2020 మ్యాచ్ 6 కింగ్స్ XI పంజాబ్.. రాయల్ ఛాలెంజర్స్ పంజాబ్ మధ్య జరిగింది. పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ శతకంతో చెలరేగడంతో బెంగళూరు జట్టుపై 97 పరుగులతో ఘనవిజయం సాధించింది.
టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
రాహుల్‌ అర్ధసెంచరీ : రాహుల్‌ 36 బంతుల్లో 50 పరుగులు సాధించాడు.
పంజాబ్ టీం యజమాని ప్రీతీ జింటా ఆనందం!
పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(132 నాటౌట్) శతకంతో చెలరేగాడు.
123.. మూడు ఓవర్లు.. మూడు వికెట్లు..దేవ్‌దత్‌ పడిక్కల్‌..జోష్‌ ఫిలిప్‌ డకౌట్.. బెంగళూరు కెప్టెన్ కోహ్లీ.. వరుసగా ఔట్!
వరుసగా రెండు ఓవర్లు.. రెండు కీలక వికెట్లు..ఆరోన్‌ ఫించ్‌!..డివిలియర్స్‌!..8,9ఓవర్లలో పెవిలియన్ చేరారు. అప్పటికి బెంగళూరు స్కోరు 57/5
మళ్ళీ వరుసగా మూడు ఓవర్లు..13,14,16.. శివం దూబే..ఉమేష్ యాదవ్..వాషింగ్టన్‌ సుందర్‌ ఔట్! బెంగళూరు పరాజయం ఖరారు!
బెంగళూరు 109 పరుగులకు ఆలౌటైంది. దీంతో పంజాబ్ జట్టు 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.