నాలుగు వరుస ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం కొంపముంచింది. ముంబై బౌలర్ బౌల్ట్ మొదటి ఓవర్లోనే స్టయిన్స్ వికెట్ తీశాడు. తరువాత మూడో ఓవర్లో మరోసారి రహానేను అవుట్ చేసి ఢిల్లీని చావు దెబ్బ కొట్టాడు. నాలుగో ఓవర్లో జయంత్ ధావన్ ను ఔట్ చేయడంతో ఢిల్లీ కష్టాల్లో కూరుకుపోయింది.
ఢిల్లీని ఆడుకున్న శ్రేయాస్..పంత్ జోడీ!
వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఢిల్లీని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (50 బంతుల్లో 65) రిషబ్ పంత్(38 బంతుల్లో 56) తో కలసి ఆదుకున్నాడు.
ఢిల్లీ 156 పరుగులు
అటు ఓపెనర్లు.. ఇటు టైల్ ఎండర్స్ చేతులేట్టేసినా.. మిడిల్ ఆర్డర్ లో శ్రేయాస్, పంత్ జోడీ చేసిన ప్రయత్నంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది.
రోహిత్ అద్భుతం!
మొదటి నుంచి దూకుడుగా ఆడిన ముంబై జట్టు.. క్వింటన్ వికెట్ కోల్పోయిన తరువాత కెప్టెన్ రోహిత్ శర్మ విరుచుకు పడడంతో అవలీలగా విజయాన్ని చేరుకుంది. రోహిత్ 51 బంతుల్లో 68 పరుగులు చేస్తే.. ఇషాన్ కిషన్ సుడిగాలిలా 19 బంతుల్లో 33 పరుగులు చేసి ముంబై ఘన విజయంలో పాలు పంచుకున్నాడు.
అలవోక విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 13 విజేతగా నిలిచింది. ఇది ఆ జట్టుకు ఐదో ఐపీఎల్ టైటిల్. ఆరుసార్లు ఫైనల్ కు చేరిన ముంబై జట్టు ఐదు సార్లు టోర్నీని గెలిచిన చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా..చెన్నై సూపర్ కింగ్స్ తరువాత డిపెండింగ్ ఛాంపియన్ గా కప్పు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డులకెక్కింది.