తల్లిదండ్రులకి అలర్ట్.. పిల్లల్లో పెరుగుతున్న 'ఐ ఫ్లూ' కేసులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

కళ్లలో మంట, కళ్ల వాపు, నీరు కారడం, నొప్పితో కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు కండ్ల కలక వచ్చినట్లు అర్థం చేసుకోవాలి.
వీలైనంత వరకు ఇతర వ్యక్తులకి దూరంగా ఉండాలి. 3 రోజుల తర్వాత తగ్గకుంటే వెంటనే నేత్ర వైద్యుడిని సంప్రదించాలి.
బాక్టీరియా, వైరస్ వల్ల వచ్చే ఐ ఫ్లూ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
చేతులు తరచూ సబ్బుతో కడుక్కోవాలి. శభ్రమైన, ఉతికిన టవల్స్ లేదా కర్చీఫ్‌లు మాత్రమే వాడాలి.
కళ్లల్లో విపరీతమైన నొప్పి, దురద, బాగా ఎరుపెక్కి మంట ఎక్కువవుతుందంటే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలని గుర్తుంచుకోండి.