ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో రోగనిరోధక శక్తే మనల్ని కాపాడుతుంది. ఇమ్యూనిటీ పెరగాలంటే మన రక్తంలో ఐరన్ నిల్వలు తగినంత ఉండాలి. రక్తహీనత వల్ల అనేక సమస్యలు వస్తాయి. అందుకే ఆహారంలో ఇనుము తప్పక ఉండేలా చూసుకోవాలి.
దానిమ్మ
ఈ పండులో ఇనుము, మెగ్నిషియం, క్యాల్షియం మూలకాలతోపాటు విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ గింజల పొడిని రోజుకు రెండు చెంచాలు గోరువెచ్చని నీటితో తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
పాలకూర
ఐరన్ ఎక్కువగా లభించే ఆకుకూరల్లో ఇది చాలా ముఖ్యమైంది. దీంట్లో యాంటీఆక్సిడెంట్లూ పుష్కలం. కాబట్టి కూర, పప్పు, సూప్... ఇలా నచ్చిన పద్ధతిలో తీసుకోండి.
యాపిల్
యాపిల్‌ను రోజూ తింటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వారికి చక్కటి ఎంపిక ఇది.
జామ
దీంట్లో విటమిన్-సితోపాటు ఐరన్ అధికంగానే ఉంటుంది. రక్తవృద్ధిని పెంచుతుంది.
అరటిపండు
దీంట్లో ఐరన్ నిల్వలు ఎక్కువ. కాబట్టి తరచూ తీసుకోవాలి.
బీట్రూట్
శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. దీని ఆకుల్లో.. దుంపలో కంటే మూడు రెట్లు ఎక్కువ ఐరన్ ఉంటుంది.