ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ పండ్లు తింటే త్వరగా బరువు తగ్గుతారు
మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారంతోపాటు పండ్లు తీసుకోవాలి. అయితే ఏ పండ్లను ఎప్పుడు తినాలనేది చాలా ముఖ్యం. ఖాళీ కడుపుతో ఏ పండ్లు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
యాపిల్ లో ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో యాపిల్ తింటే బరువు అదుపులో ఉంటుంది. జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.
కివిలో పీచు, విటమిన్ సి మొదలైనవి అధిక మొత్తంలో ఉంటాయి. కివీని ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమై శరీరానికి శక్తిని అందిస్తుంది.
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో వీటిని తింటే ఐరన్ లోపం తగ్గుతుంది. వాపు సమస్యను తగ్గిస్తుంది.
బొప్పాయిలో అన్ని రకాల విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో దీన్ని తింటే జీర్ణక్రియ మెరుగుపడి చర్మానికి మేలు చేస్తుంది.
బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో తింటే మెదడుకు బలం చేకూరుతుంది. చర్మం మెరుస్తుంది.
జామపండులో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జామపండును ఖాళీ కడుపుతో తింటే మలబద్ధకం సమస్య దూరమౌతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
పుచ్చకాయను ఖాళీ కడుపుతో తింటే పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఇందులో ఉండే లైకోపిన్ గుండె, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది
సీజనల్ పండ్లు, నారింజ, పైనాపిల్ వంటి సిట్రిక్ పండ్లు ఖాళీ కడుపుతో తినకూడదు. దీనివల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి.