రోజుకో ఆరెంజ్ తింటే ఆ వ్యాధులన్నీ పరార్

నారింజ
సిట్రస్ పండ్లలో నారింజ ఒకటి. ఇందులో విటమిన్ సి, బి కాంప్లెక్స్, బీటా కెరోటిన్, మాంగనీస్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది.
ఆస్తమా
ఆరెంజ్ జ్యూసులో ఉప్పు , మిరియాలు వేసి తాగడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇమ్యూనిటి
నారింజలో ఉండే విటమిన్ ఇమ్యూనిటి పెంచుతుంది. తెల్ల రక్తకణాలను బలపరుస్తుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
క్యాన్సర్ నివారణ
నారింజలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఇందులో డి లిమోనెన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటిని నిరోధిస్తుంది.
హిమోగ్లోబిన్
నారింజలో విటమిన్ బి6 హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
కొలెస్ట్రాల్
నారింజ తొక్కలో ఉండే పాలీమెథాక్సిలేటెడ్ ఫ్లేవోన్స్ అనే సమ్మేళనాలు కొన్ని మందుల దుష్ప్రభావాలు లేకుండా కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
కంటి ఆరోగ్యం
నారింజలో కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ ఎ కంటిశుక్లం ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. విటమిన్ ఎ వయస్సు సంబంధిత సమస్యలున తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యం
నారింజలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తం గడ్డ కట్టడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెజబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మం
ప్రతిరోజూ ఒక నారింజ తింటే ముఖచర్మం మెరుగుపడుతుంది. కాంతిని పెంచతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.