ఈ డ్రింక్స్ తాగితే మెరిసే చర్మం మీ సొంతం

సరైన పోషకాహారం తీసుకుంటే వ్రుద్దాప్యాన్ని తగ్గించి యవ్వనంగా కనిపంచేలా చేస్తుంది. నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుందని తెలుసు. కానీ కొన్ని డ్రింక్స్ తాగితే చర్మం మెరుస్తుంది.అవేంటో చూద్దాం.
గ్రీన్ టీ
ఆరోగ్యకరమైన పానీయాలలో గ్రీన్ టీ ఒకటి. సూర్యరశ్మి నుంచి కాపాడుతుంది. ముఖంపై ముడతులు, మచ్చలను నివారిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
పాలు
పాలలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుందని మనందరికీ తెలుసు. కండరాలు, ఎముకలు బలంగా ఉంచడంలో పాలు ఎంతో సహాయం చేస్తాయి. ముఖంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
ఆరెంజ్ జ్యూస్
ఆరెంజ్ జ్యూసులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది.
కోకో
6. కోకో ఒక కప్పు వేడి కోకోను తాగితే మీ చర్మం మెరుస్తుంది. కోకూ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
టమాటో జ్యూస్
టమాటో జ్యూస్ లో ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. శరీరంలో మంటను తగ్గిస్తాయి.
బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్ జ్యూసులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి పొటాషియం , ఫొలేట్ పుష్కలంగా ఉంటుంది.
చర్మం ఆరోగ్యం
ఇది మంచి ప్రీ వర్కౌట్ డ్రింక్ ని తయారు చేస్తుంది. బీట్ రూట్ ను బ్రేక్ ఫాస్టులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పైన పేర్కొన్న జ్యూసులన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటే వాటిలో పోషకాలు మీ చర్మాన్ని మెరిసేలా, యవ్యనంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.