కొబ్బరి నూనెలో ఈ ఆకులు కలిపి రాసుకుంటే జుట్టు ఊడదు
వయసుతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరిలోనూ జుట్టు ఊడే సమస్య అనేది పెరుగుతుంది ఫలితంగా మగవారిలో బట్టతల స్త్రీలలో కూడా జుట్టు చిన్నగా అయిపోవడం వంటివి చూస్తున్నాం.
జుట్టు ఊడిపోవడం అనేది జీవనశైలి సమస్యగా చెప్పవచ్చు. ముఖ్యంగా పెరుగుతున్న కాలుష్యము అలాగే మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కూడా జుట్టు ఊడిపోయే సమస్య పెరుగుతోంది.
జుట్టు ఊడే సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అలాంటి చిట్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొబ్బరి నూనెలో కరివేపాకులను మరిగించి ఆ తర్వాత ఆ నూనెను వడపోసి మీ తలకు మాలిష్ చేసుకున్నట్లయితే.. మీ వెంట్రుకలు మూలాల నుంచి బలపడతాయి.
కొబ్బరి నూనె సహజ సిద్ధమైన మాయిశ్చరైసర్ గా పనిచేస్తుంది. ఇది మీ వెంట్రుకలను బలోపేతం చేస్తుంది.
ఇక కరివేపాకు లోని బీటా కెరోటిన్ మీ వెంట్రుకలను మూలాల నుంచి బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుంది.
కరివేపాకు లోని సహజసిద్ధమైనటువంటి విటమిన్ కె విటమిన్ ఈ మీ వెంట్రుకలకు బలాన్ని అందించడంలో ఉపయోగపడతాయి.
కరివేపాకు నూనెతోపాటు కరివేపాకు పొడి చేసుకొని ప్రతిరోజు అన్నంలో కలుపుకొని తింటే మీ వెంట్రుకలకు కావాల్సిన పోషకాలు రక్తం ద్వారా లభించే అవకాశం ఉంది.
జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణము షాంపూలు అని కూడా చెప్పవచ్చు. షాంపూల్లో ఉండే ప్రమాదకరమైన సల్ఫేట్లు జుట్టును మూలాల నుంచి బలహీనం చేస్తాయి.
పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న సంబంధిత డాక్టర్ ను సంప్రదించండి.