జుట్టు కోసం కరివేపాకు నూనె..ఎలా తయారు చేయాలి?

బీటాకెరోటిన్, ప్రొటీన్ పుష్కలంగా ఉండే కరివేపాకు జుట్టుకు రాలడాన్ని తగ్గిస్తుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. కరివేపాకు నూనె జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ నూనె ఎలా తయారు చేయాలో చూద్దాం.
ఒక కప్పు కొబ్బరి నూనె, కొన్ని తాజాగా కరివేపాకులు తీసుకోవాలి.
స్టౌ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి వేడి చేయాలి. అందులో కొబ్బరినూనె పోయాలి. వేడి చేయాలి.
ఇప్పుడు కొబ్బరినూనె వేడెక్కిన తర్వాత అందులో కరివేపాకులు వేయండి. చిటపట అనేంత వరకు ఉంచండి.
కరివేపాకులు నలుపు రంగులోకి మారే వరకు ఉంచండి. తర్వాత స్టౌ ఆఫ్ చేయండి.
నూనె చల్లారిన తర్వాత అందులో నుంచి కరివేపాకులను తీసేయాలి.
ఈ నూనెను తలకు పట్టించాలి. కుదుళ్ల వరకు బాగా మర్దన చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ నూనె తలకు రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
కరివేపాకులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి జుట్టు నెరవడం, తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తుంది.