సాధారణంగా బ్యాంకులు సిబిల్ స్కోర్ చూసి రుణాలను మంజూరు చేస్తూ ఉంటారు. సిబిల్ స్కోర్ అనేది ఒక క్రెడిట్ స్కోర్.
సిబిల్ అనే సంస్థ ఈ క్రెడిట్ స్కోర్ ను అందిస్తుంది. బ్యాంకుల సాధారణంగా సిబిల్ సంస్థ జారీ చేసే క్రెడిట్ స్కోర్ ను ప్రామాణికంగా తీసుకుంటాయి.
ఇందులో మీ పాన్ కార్డు ఆధారంగా మీరు గతంలో తీసుకున్న లోన్లు క్రెడిట్ కార్డు చెల్లింపులు వంటి హిస్టరీని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మీరు తిరిగి చెల్లించే చెల్లింపుల ద్వారా క్రెడిట్ స్కోర్ కేటాయిస్తాయి.
సాధారణంగా సిబిల్ స్కోర్ 400 నుంచి 900 వరకు ఉంటుంది.
ఎనిమిది వందల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీ సిబిల్ స్కోర్ అద్భుతంగా ఉందని అర్థం మీరు అప్లై చేసుకున్నారు. లోన్లు త్వరగా పొందే అవకాశం ఉంటుంది.
మీ సిబిల్ స్కోర్ 700 కన్నా ఎక్కువగా ఉంటే మీ క్రెడిట్ స్కోర్ మామూలుగా ఉందని అర్థం. కొన్ని బ్యాంకులు 700 కన్నా ఎక్కువ ఉన్నవారికి కూడా లోన్లు అందిస్తాయి.
మీ సిబిల్ స్కోర్ 700 కన్నా తక్కువగా ఉంటే లోన్ పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కొన్ని బ్యాంకులు ఎక్కువ వడ్డీరేట్లకు మీకు లోన్ అందించే అవకాశం ఉంది.
ఇక సిబిల్ స్కోర్ 600 కన్నా తక్కువగా ఉంటే మాత్రం మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి.
మీ సిబిల్ స్కోర్ పెరగాలి అంటే వెంటనే మీ బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డులను సెటిల్ చేసుకొని ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే సరెండర్ చేయాల్సి ఉంటుంది.
అలాగే గతంలో ఏవైనా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఎన్వోసీ పొందకపోతే మీకు క్రెడిట్ స్కోర్ దెబ్బ తినే ప్రమాదం ఉంది. వెంటనే అలాంటి ఖాతాలను గుర్తించి లోన్ అకౌంట్ ముగించి బ్యాంకు నుంచి ఎన్ఓసి తీసుకోవాలి.