ఒక వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి?

నీళ్లు ఎంత ఎక్కువ తాగితే ఆరోగ్యానికి అంత మంచిది. చర్మం
ఒక వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్లు నీళ్లు తాగాలో తెలుసా?
మన శరీర బరువలో 50-70శాతం నీళ్లు ఉంటాయి. శరీరానికి తగినంత నీరు అందించడం చాలా ముఖ్యం.
నీళ్లు మన శరీరంలో నుంచి టాక్సిన్స్ తొలగించి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మేయో క్లినిక్ ప్రకారం..ఒక వ్యక్తి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వైద్య పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. దీన్ని బట్టి నీళ్లు తాగాల్సి ఉంటుంది.
ఏసీలో కూర్చొన్న వ్యక్తి కంటే ఎక్కువసేపు ఎండలో ఉండే వ్యక్తికి నీరు అవసరం ఉంటుంది.
ప్రతి వ్యక్తి తన భౌతిక, భౌగోలిక, వైద్య పరిస్థితిని బట్టి నీళ్లు తాగాలి.
యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెన్స్ ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రకారం పురుషులు రోజుకు 3.7లీటర్ల నీరు తాగాలి.
మహిళలు 2.7 లీటర్ల నీరు తాగాలని పేర్కొంది.