కోడి సంవత్సరానికి ఎన్ని గుడ్లు పెడుతుంది? ఆన్సర్ మీకు తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ గుడ్లను వినియోగిస్తారు. కోళ్లు కాకుండా బాతు, టర్కీతోపాటు ఇతర పక్షుల గుడ్లు తింటారు.
ప్రతిరోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటున్నాం. ఎందుకంటే గుడ్డులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.
చిన్నపిల్లలకు ప్రతిరోజూ గుడ్డు తినిపిస్తే కండరాలు బలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందుకే గుడ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
కోడి సంవత్సరానికి ఎన్ని గుడ్లు పెడుతుందో మీకు తెలుసా?
దేశీ కోళ్లు ఏడాదికి 100 నుంచి 150 గుడ్లు పెడతాయి. ఈ సంఖ్య మారుతూ ఉంటుంది.
లేయర్ పక్షి ఏడాదికి 290 గుడ్లు పెడుతుంది.
ఆస్ట్రేలియా కోళ్లు ఏడాదికి 290 నుంచి 300 గుడ్లు పెడతాయి.
కడక్ నాథ్ పేరు చాలా ప్రసిద్ధి చెందిన కోడి. ఇది ఏడాదిలో 60 నుంచి 80గుడ్లు పెడుతుంది.
కోళ్లు 20వ వారం నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి.