హాప్‌ ఈ-బైక్‌ లు లియో, ఎల్‌వైఎఫ్‌

హాప్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మంగళవారం మార్కెట్‌ లోకి రెండు కొత్త ఇ-స్కూటర్‌లను తీసుకొచ్చింది.
లియో, ఎల్‌వైఎఫ్‌ పేరుతో తీసుకొచ్చిన ఇ-స్కూటర్‌లు ఒకసారి ఛార్జ్‌ చేస్తే 125 కి.మీ. ప్రయాణించవచ్చు.
లియో, ఎల్‌వైఎఫ్‌ ధరలు వరుసగా రూ.72,000... రూ.65,000గా నిర్ణయించారు.
ఇంటర్నెట్‌, జీపీఎస్‌, మొబైల్‌ యాప్‌తో పాటు, 72వాట్ల అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే మోటార్‌ను వీటిలో అమర్చారు.
180 కేజీల వరకూ బరువును ఈ స్కూటర్లు మోయగలవు.
లియో బేసిక్‌, లియో, లియో ఎక్స్‌టెండ్‌ ఇ-స్కూటర్లు గంటకు 60కి.మీ. వేగంతో ప్రయాణించగలవు.
పార్క్‌ అసిస్టెంట్‌, సైడ్‌ స్టాండ్‌ సెన్సార్‌, మూడు రైడింగ్‌ మోడల్‌లు, డ్యుయల్‌ డిస్క్‌ బ్రేక్స్‌, యూఎస్‌బీ ఛార్జింగ్‌, రీమోట్‌ కీ, యాంటీ థెఫ్ట్‌ అలారమ్‌ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.