ముక్కు దిబ్బడతో ఇబ్బందా

చలికాలంలో ముక్కు దిబ్బడ చాలామందిని వేధిస్తుంది. ఇంట్లోనే పాటించగల 4 సింపుల్ చిట్కాలు ఇవే.
గోరువెచ్చని నీటిలో నూనె
గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె లేదా పుదీనా నూనె వేయాలి.
ఆవిరి పీల్చండి
ఆ నీటి నుంచి వచ్చే ఆవిరిని పీల్చాలి. ముక్కు దిబ్బడ తగ్గించుకునే మొదటి చిట్కా ఇది.
హైడ్రేట్‌గా ఉండండి
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలి.
శ్లేష్మం కరిగిపోతుంది
గోరువెచ్చని నీరు తాగడం వల్ల ముక్కులోని శ్లేష్మం కరిగిపోతుంది. దీంతో ముక్కు తేలికపడుతుంది.
పాలలో చిటికెడు పసుపు
గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి. ఇది ముక్కు దిబ్బడకు పనికొచ్చే ఇంటి చిట్కా.
వాపు తగ్గి ఉపశమనం
పసుపు పాలు తాగితే ముక్కులో వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.
హెర్బల్ టీ తాగండి
అల్లం, పసుపు, లవంగాలు లేదా తులసి కలిపిన హెర్బల్ టీ తాగాలి.
ముక్కు మార్గాలు క్లియర్
హెర్బల్ టీ తాగితే ముక్కు మార్గాలు క్లియర్ అవుతాయి. శ్వాస తీసుకోవడం తేలికవుతుంది.
4 చిట్కాలు గుర్తుంచుకోండి
ఆవిరి, గోరువెచ్చని నీరు, పసుపు పాలు, హెర్బల్ టీ.. ఈ 4 చిట్కాలతో చలికాలంలో ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు.