ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలస్ట్రాల్ అని గుర్తించండి.. అవేంటంటే..?
విశ్రాంతి లేకపోవడం, చెమట పట్టడం: రక్తం తగినంత పరిమాణంలో గుండెకు చేరుకోనప్పుడు, గుండె తక్కువ రక్తాన్ని పంపింగ్ చేయడం ప్రారంభించినప్పుడు చెమట పరిస్థితి తలెత్తుతుంది.
శరీర నొప్పులు: ఒక వ్యక్తి మెడ, దవడ, కడుపు, వెనుక భాగంలో నొప్పిని అనుభవిస్తే అది కొలెస్ట్రాల్‌ను పెంచే లక్షణం అయి ఉంటుంది.
పాదాలలో జలదరింపు: ఒక వ్యక్తికి చేతులు, కాళ్ళలో జలదరింపు అనిపించినా లేదా చీమ కుట్టినట్లు అనిపించినా అది కొలెస్ట్రాల్‌ను పెంచే లక్షణం కావొచ్చు.
కళ్లపై పసుపు దద్దుర్లు: ఒక వ్యక్తి కళ్లపై పసుపు మచ్చలు కనిపిస్తే అది కొలెస్ట్రాల్‌ను పెంచే లక్షణం కావొచ్చు. రక్తంలో కొవ్వు పరిమాణం పెరిగినప్పుడు ఇది జరుగుతుంది.