Hibiscus Hair Oil Benefits : నాగుపాము లాంటి జడ కావాలంటే ఈ నూనెను తలకు పట్టించండి

నేటికాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు జుట్టు రాలిపోతుంది. జీవకశైలి, ఆహారపు అలవాట్లు జుట్టు రాలడానికి కారణాలు కావచ్చు.
మీ జుట్టు మందంగా బలంగా పొడుగ్గా పెరగాలంటే మందారపువ్వులతో తయారు చేసిన నూనె ను వాడితే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
మందారనూనెలో విటమిన్ సి, ఫాస్పరస్ ఉన్నాయి. ఇవి జుట్టును బలంగా ఉంచడంతో కీలకంగా పనిచేస్తాయి. జుట్టు చివర్లు చిట్లకుండా కాపాడుతుంది.
మందార నూనెలోని పోషకాలు స్కాల్ప్ కు పోషణ అందించడంలో సహాయపడతాయి. రక్త ప్రసరణను పెంచుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తుంది.
మందార నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతాయి. అకాల జుట్టు నెరవడాన్ని నివారిస్తాయి. రోజువారీ జుట్టు సంరక్షణలో మందారం నూనెను వాడండి
మందార నూనెను క్రమం తప్పకుండా వాడినట్లయితే మీ జుట్టు మెరిసిపోతుంది. సిల్కీగా మారతుంది. మందార నూనెలోని విటమిన్ ఇ జుట్టుకు పోషణను అందిస్తుంది.
మందార నూనెలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టును బలంగా ఉంచుతాయి.
జుట్టు పెరుగుదలకు రాత్రి ఈనూనె తలకు పట్టించాలి. మసాజ్ చేయాలి. రాత్రి పూట ఈ నూనె రాసుకుంటే జుట్టు కుదుళ్లకు బాగా పడుతుంది.
మందార నూనెలో ఉన్న విటమిన్ ఇ, అమైనో ఆమ్లాలు, విటమిన్ సి కొల్లాజెన్ ను ప్రేరేపిస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.