హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. గత వందేళ్ళలో ఇది రెండో పెద్ద వానగా చెబుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 32 సెంటీమీటర్ల వాన కురిసింది. అత్తాపూర్ లో వర్షం నీటిలో మునిగిన కారు.
ANI Image
హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు ఎరుల్లా మారిపోయాయి. పలు ప్రాంతాల్లో నీరు ఎలా రోడ్ల మీద ప్రవహిస్తోందో చూడండి
హైదరాబాద్ లో భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. గగన్ పహాడ్ ప్రాంతంలో ఇళ్ళు కూలడంతో ముగ్గురు మరణించారు. గగన్ పహాడ్ లో వర్షం నీరు ఎలా ప్రవహిస్తోందో చూడండి..
హైదరబాద్ చంపాపేట ప్రాంతంలో ఇళ్ళ మధ్యలో రోడ్ల మీద నుంచి ప్రవహిస్తున్న వర్షం నీళ్ళు!
భారీ వర్షాలతో రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోగా.. హైదరాబాద్ దమ్మయిగుడా ప్రాంతంలో వాన నీటిలో కొట్టుకుపోతున్న కారు