తల్లిపాలతో ఇద్దరికీ మేలు

మాతృత్వం
మాతృత్వం అనేది పాలివ్వడంతోనే ప్రారంభం అవుతుంది. చనుబాలు ఇస్తే తల్లికి, బిడ్డకు ఎంత మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
తల్లిపాలలో సంపూర్ణ పోషకాలు
తల్లిపాలలో సంపూర్ణ పోషకాలు ఉన్నాయి. బిడ్డకు ఈ పోషకాలన్నీ తల్లిపాలు తాగితే అందుతాయి. దీంతో బిడ్డ వేగంగా పెరుగుతాడు.
వైరస్ లు తట్టుకోవడం
కొత్త రకం బ్యాక్టీరియా, వైరస్ తట్టుకునే శక్తి తల్లిపాలలో ఉటుంది. తల్లి పాలు తాగే చిన్నారులు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
ఆస్తమా, ఊబకాయం
తల్లిపాలు తాగే పిల్లలకు ఆస్తమా, ఊబకాయం, టైప్ 1 డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
సిడ్స్
సడెన్ ఇన్ ఫాంట్ డెత్ సిండ్రోమ్స్ అంటే అకారణంగా మరణించే ముప్పు బిడ్డకు తొలగుతుంది.
కంటి సమస్యలు
నెలలు నిండక ముందే పుట్టిన శిశువులకు తల్లిపాలు తాగితే కంటి సమస్యలు రావు. మెదడు వాపు, చెవి నొప్పి కూడా రావు .
అంటు వ్యాధులు
డయేరియా, మలబద్దకం, న్యుమోనియా, దగ్గు, జలుబు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఎముకలు బలంగా
తల్లి పాలు తాగే పిల్లల్లో ఎముకలు బలంగా ఉంటాయి. మాటిమాటికీ ఏడుస్తూ ఇబ్బంది పెట్టరు.