టైగర్ నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి గురించి చాలా మందికి తెలియదు. వీటిలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ కచ్చితంగా డైట్లో చేర్చుకోవాలి.
జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్ నట్స్ ఇవి మాత్రమే తెలుసు. కానీ ఈ టైగర్ నట్స్ గురించి చాలా మందికి తెలియదు. ఇందులో మిగతా వాటికంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.
టైగర్ నట్స్ అనగానే పులులకు సంబంధం ఉందనుకుంటారు. కానీ వాటిపైన చారలు ఉండటంతో టైగర్ నట్స్ అని పేరు వచ్చింది.
ఈ గింజలను డైట్లో చేర్చుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణం కానీ ఆహారాన్ని సైతం జీర్ణం చేస్తుంది.
ఈ గింజల్లో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఫైబర్ పెద్ద ప్రేగులో చక్కెర శోషణను అడ్డుకుంటుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది.
టైగర్ గింజల్లో 18 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. గుడ్డుకు సమానంగా ప్రొటీన్ ఉంటుంది. వీటిని తింటే ఎముకలు బలంగా ఉంటాయి.
టైగర్ నట్స్ లోని మోనో శాచురేటెడ్ కొవ్వు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ఇవి కణాల ఆరోగ్యానికి సహాయపడతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.