క్యాన్సర్ నివారణలో మేటి:

ఎరుపు, పసుపు క్యాప్సికమ్‌లలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో క్యాన్సర్ కణాల ఎదుగుదలను అడ్డుకుంటాయి.
ప్రోస్టేట్, లంగ్స్ క్యాన్సర్‌కు చెక్:
ఎరుపు క్యాప్సికమ్‌లోని లైకోపీన్ అనే కాంపౌండ్ ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
విటమిన్-సీ గని:
ఒక్క మీడియం సైజ్ ఎర్రటి క్యాప్సికమ్ తింటే రోజువారీ అవసరానికి కంటే మూడు రెట్లు ఎక్కువ విటమిన్-సీ లభిస్తుంది.
రోగనిరోధక శక్తి పెరుగుదల:
సమృద్ధిగా ఉండే విటమిన్-సీ శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
కంటి చూపుకు రక్షణ:
పసుపు క్యాప్సికమ్‌లోని విటమిన్-ఏ, లూటీన్ రేచీకటి, క్యాటరాక్ట్ (శుక్లాలు) వంటి సమస్యల నుంచి కళ్లను కాపాడతాయి.
గుండె ఆరోగ్యం భద్రం:
ఈ రంగుల బెల్ పెప్పర్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
చర్మ సౌందర్యం, వృద్ధాప్య ఛాయలకు చెక్:
క్యాప్సికమ్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
పచ్చిగా తింటేనే పూర్తి ప్రయోజనం:
ఎరుపు, పసుపు క్యాప్సికమ్‌లను పచ్చిగా సలాడ్లలో లేదా డిప్స్‌తో తీసుకోవడం వల్ల విటమిన్-సీ నశించకుండా లభిస్తుంది.
తక్కువగా ఉడికించడం శ్రేయస్కరం:
వీటిని ఎక్కువ నూనెలో వేయించడం లేదా ఎక్కువసేపు ఉడికించడం చేయకుండా తేలికగా స్టీమ్, సాల్టే లేదా గ్రిల్ చేసి మాత్రమే తినాలి.
ఆలివ్ ఆయిల్‌తో ఉత్తమ ఫలితాలు:
క్యాప్సికమ్‌లోని ఏ, ఈ విటమిన్లు త్వరగా శరీరానికి అబ్బాలంటే కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా గింజలతో కలిపి తీసుకోవడం మంచిది.