Tulsi leaves: ప్రతిరోజూ రెండు తులసి ఆకులు తింటే షుగర్ రమ్మన్నారాదు

తులసిని హిందూవులు పవిత్రంగా భావిస్తారు. శతాబ్దాులగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. స్వచ్చత, రక్షణ, ఆధ్యాత్మిక భావనకు తులసి ప్రతీకగా నిలుస్తోంది.
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తులసి ఆకులను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. తులసి వల్ల ప్రయోజనాలేంటో చూద్దాం.
తులసిలో విటమిన్ సి, యూజినాల్ తో సహా అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. శరీరాన్ని బలంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో తులసి కీలక పాత్ర వహిస్తుంది. మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మెరిచేలా చేస్తుంది.
పరగడుపున తులసిని తినడం వల్ల జీర్ణ ఎంజైమ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
తులసి ఆకులు తింటే ఒత్తిడి, మానసిక స్థితిని కాపాడుతుంది. మానసికంగా బలంగా ఉంచేలా చేస్తుంది. ప్రశాంత భావాన్ని ప్రోత్సహిస్తుంది.
తులసిలోని యాంటీ మైక్రోబయల్ , యాంటీ ఇన్ఫ్లేమటరీ దగ్గు, జలుబు, ఉబ్బసం, శ్వాసకోశ ఉపశమనాన్ని అందిస్తుంది.
తులసి ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంచుతుంది. గ్లూకోజ్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.
రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. డయాబెటిస్ రోగులు ప్రతిరోజూ తులసి ఆకులు తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.