పియర్స్ తింటే గుండె సమస్యలు రావంట

మీ ఆహారంలో పియర్స్ చేర్చుకోవడం వల్ల కొన్ని అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో చూద్దాం.
పియర్స్ గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
పియర్స్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ప్రీబయోటిక్స్ కూడా ఉణ్నాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
పియర్స్ లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
ఈ పండులో ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించి వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ , ఆంథోసైనిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
రక్తపోటును మెరుగుపరచడం, కొలెస్ట్రాల్ ను తగ్గించడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పెంచే ప్రోసైనిడిన్స్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పియర్స్ లో ఉన్నాయి.
పియర్స్ ను డైట్లో చేర్చుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి.
పియర్స్ లో బరువును తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే వీటిని డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.