Gourd Juice: సోరకాయ జ్యూస్ ఇలా తాగితే ఫాస్టింగ్లో మీ షుగర్ నార్మల్ అవ్వడం ఖాయం
మీరు డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారా డయాబెటిస్ అనేది ఒక జీవనశైలికి చెందిన వ్యాధి అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు
ముఖ్యంగా ఆయుర్వేదంలో కొన్ని రకాల కూరగాయల జ్యూసులను తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చని తెలిపారు అందులో సొరకాయ ఒకటి
సొరకాయలు ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది సొరకాయలో ఉన్న పోషకాలు మరె ఇతర కూరగాయలను లభించవు ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి
సొరకాయ మీ జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది. సొరకాయను కూర చేసుకొని కూడా తినవచ్చు. అలాగే సొరకాయ జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
సొరకాయలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మీ డైట్ లో సొరకాయను చేర్చుకుంటే మీ శరీరానికి కావలసిన ఇన్సులిన్ లభిస్తుంది.
సొరకాయను సలాడ్ లా కూడా తినవచ్చు. సొరకాయను సన్నగా తురిమి స్వీట్ కూడా తయారు చేస్తుంటారు.
సొరకాయను సన్నగా తురిమి పెరుగులో కలిపి మరికొన్ని కూరగాయ ముక్కలు వేసి రైతా తయారు చేసుకొని తినవచ్చు. ఇలా తిన్నట్లయితే మీ కడుపులో గట్ బ్యాక్టీరియా ఏర్పడుతుంది.
సొరకాయలో లివర్ నుండి విష పదార్థాలను తొలగించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరైతే రెగ్యులర్ గా సొరకాయ జ్యూస్ తాగుతారో వారి లివర్ భద్రంగా ఉంటుంది.
సొరకాయను రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే, కిడ్నీ వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు ముఖ్యంగా సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కిడ్నీని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది.
సొరకాయలోని ఫైబర్ మీ రక్తంలో కొలెస్ట్రాల్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా గుండె లోపల బ్లాక్లుగా ఏర్పడే చెడు కొలెస్ట్రాల్ ను సొరకాయ రసం వల్ల తొలగించుకోవచ్చు.