మఖానాలో క్యాలరీలు తక్కువ, కానీ ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలం. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వెయిట్ లాస్ ఫ్రెండ్లీ:
దీనిలోని అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల చిరుతిండి తినాలనే కోరిక తగ్గుతుంది, బరువు సులభంగా తగ్గుతారు.
యాంటీ ఏజింగ్ గుణాలు:
మఖానాలో ఉండే అమైనో యాసిడ్స్ చర్మం స్థితిస్థాపకతను కాపాడతాయి. ముడతలు పడకుండా చేసి, ముఖాన్ని యవ్వనంగా మార్చడంలో ఇవి సహాయపడతాయి.
మోతాదు మించితే ముప్పు:
రోజుకు 30 గ్రాముల (ఒక గుప్పెడు) కంటే ఎక్కువ మఖానా తీసుకోవడం మంచిది కాదు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.
వీరు జాగ్రత్తగా ఉండాలి:
అధిక కాల్షియం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు, అలర్జీ సమస్యలు ఉన్నవారు, ఇతర దీర్ఘకాలిక మందులు వాడే వారు వైద్యుల సలహా మేరకే వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.