Happy Birthday Pollard: హ్యాపీ బర్త్ డే వెస్టిండీస్ సంచలనం
బర్త్ డే సందర్భంగా ఈ హార్డ్ హిట్టర్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీకోసం..
జననం: ట్రినిడాడ్‌లోని టకరిగ్వాలో 1987, మే12న
వన్డేల్లో అరంగేట్రం:
2007 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఏప్రిల్ 10న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు.
వన్డే స్టాట్స్:
ఇప్పటివరకు 116 వన్డేలు ఆడి 2564 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 54 వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుతం కీరన్ పోలార్డ్ వెస్టిండీస్ టీ20 లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
టీ20లో ఎంట్రీ:
ఆస్ట్రేలియాతో 2008లో జరిగిన టీ20 మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు.
టీ20 స్టాట్స్:
ఇప్పటివరకు 79 అంతర్జాతీయ టీ20లు ఆడి 1277 పరుగులు చేశాడు. 37 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ అరంగేట్రం:
ముంబై ఇండియన్స్ తరఫున 2010లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు పొలార్డ్.
ఐపీఎల్ స్టాట్స్:
టోర్నీలో ఇప్పటిదాకా 171 మ్యాచ్‌లు ఆడి 3191 పరుగులతో సత్తా చాటాడు. అలాగే 63 వికెట్లు తీశాడు.
ఒకే ఓవర్లో 6 సిక్సులతో సంచలనం
శ్రీలంకతో ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా ఖ్యాతిగడించాడు. అలాగే టీ20ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు.