Happy Birthday Sai Pallavi: నాచురల్ బ్యూటీ గురించి తక్కువుగా తెలిసిన వాస్తవాలు
ఈటీవీలో వచ్చే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ (ఫోర్త్ సీజన్) తో సాయి పల్లవి పేరు సంపాదించింది.
కంగనా రనౌత్ తో 'ధామ్ ధూమ్' సినిమాలో నటించింది. ఈ సినిమాలో కంగనా స్నేహితురాలిగా చిన్న పాత్రలో నటించింది.
సాయి పల్లవి అద్భుతమైన డ్యాన్సర్ అని అందరికీ తెలిసిందే. అయితే, ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ ల డ్యాన్స్ ల వీడియోలను చూడడం ద్వారా ఆమె డ్యాన్స్ నేర్చుకుంది. క్లాసులకు బంక్ కొట్టి మరీ డ్యాన్స్ నేర్చుకునేది.
సాయి పల్లవి అద్భుతమైన నటి, ప్రొఫెషనల్ డ్యాన్సర్. వీటితో పాటు ఆమె ఓ డాక్టరేట్ డిగ్రీని కలిగి ఉంది. జార్జియాలోని టీవీల్స్ స్టేట్ మెడికల్ యూనివర్శిటిలో డాక్టరేట్ ను పూర్తి చేసింది.
మేకప్ లేకుండా సాయి పల్లవి తన సహజ సౌందర్యంతో ప్రేక్షకుల గుండెలను కొల్లగొడుతోంది. ఈ ‘లవ్ స్టోరీ’ నటి రూ.2 కోట్ల ఫెయిర్నెస్ యాడ్ ను తిరస్కరించి, కమర్షియల్ యాడ్లకు దూరంగా ఉంటోంది.
లాక్డౌన్లో కేరళకు వెళ్లి.. తిరిచ్చి లోని ఫారిన్ మెడికల్ గ్రాడ్యూయోట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి, తనకు చదువుపై ఉన్న మమకారాన్ని మరోసారి నిరూపించుకొంది.