కొబ్బరినూనెలో ఈ రెండు మిక్స్ చేసి జుట్టుకు రాసుకుంటే ఊడదు

జుట్టు రాలే సమస్య
ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం, నెరసిపోవడం, చుండ్రు మొదలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు.
రసాయన ఉత్పత్తులు
జుట్టు రాలకుండా ఉండేందుకు అనేక రకాల నూనెలు, షాంపూలు, టోనర్లు వంటివి మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో రసాయనాలు ఉన్నందున జుట్టును పాడు చేస్తాయి.
హోం రెమెడీస్
జుట్టు రాలడం తగ్గించేందుకు హోం రెమెడీస్ బెటర్ . ఇవి మన జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఎలాంటి హాని కలిగించవు.
ఆయిల్ మసాజ్
వారానికోసారి మీ జుట్టుకు నూనెతో మసాజ్ చేయడం చాలా ముఖ్యం. మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
వర్షాకాలంలో జుట్టు రాలడం
వర్షాకాలంలో జుట్టు చాలా ఊడిపోతుంది. చాలా మందికి వాతావరణంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది.
కొబ్బరినూనెలో ఈ రెండు మిక్స్ చేస్తే
కొబ్బరినూనెలో ఈ రెండు పదార్థాలు మిక్స్ చేసి జుట్టుకు అప్లయ్ చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అవేంటో చూద్దాం.
నిమ్మరసం
కొబ్బరి నూనెలో 2 -4 చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి అప్లై చేసుకోవాలి. కాసేపు అలాగే ఉంచి తలస్నానం చేయాలి.
ఉల్లిపాయ రసం
నిమ్మరసం లేదా ఉల్లిపాయ రసం కొబ్బరి నూనెలో కలిపి మసాజ్ చేయాలి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
హెల్తీ ఫుడ్స్
వీటితోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే జుట్టుతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.