జుట్టు వేగంగా ఒత్తుగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

పొడవైన జుట్టు అంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టం. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ఎన్నో ఉపయోగిస్తుంటారు. కానీ ఈ అద్భుత చిట్కాలు ఫాలో అయితే మీరే చక్కటి ఫలితం చూస్తారు.
హీట్ స్టైల్ వద్దు
స్టైలింగ్ కోసం చాలా మంది జుట్టును హీట్ చేస్తుంటారు. ఇలా చేస్తే వెంట్రుకలు బలహీనంగా మారి రాలిపోతాయి.
తడి జుట్టు
తడి జుట్టు బలహీనంగా ఉంటుంటి. లాగగానే ఊడిపోతుంది. అందుకే తడి జుట్టుపై దువ్వెనను వాడకూడదు.
మందులు
జుట్టు పెరగాలని చాలా మంది మెడిసిన్ వాడుతారు. వైద్యులను సంప్రదించిన తర్వాతే వాడాలి. లేదంటే సైడ్ఎఫెక్ట్స్ వస్తాయి.
చివర్లు కత్తిరించడం
జుట్టు చివర్లను ప్రతిరెండు నెలలకోసారి కత్తిరించాలి. ఇలా కత్తిరిస్తే జుట్టు పెరుగుతుంది.
అతిగా వాష్
మీ జుట్టును ప్రతిరోజూ వాష్ చేయకూడదు.వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. కెమికల్స్ తక్కువ షాంపూ వాడితే మంచిది.
నూనె
జుట్టు ఎదుగుదల, ఆరోగ్యానికి నూనె కీలకం. క్రమం తప్పకుండా నూనెను రాయాలి. దీని వల్ల కుదుళ్లు బలంగా ఉంటాయి.
కండీషనర్
తలస్నానం చేసిన ప్రతిసారీ కండీషనర్ ఉపయోగించాల్సిందే. దీనివల్ల యూవీ కిరణాలు దుమ్ము, ధూళి నుంచి రక్షిస్తుంది.