ఉసిరి గింజలను ఇలా చేసుకుని తింటే జుట్టు వేగంగా పెరుగుతుంది

ఉసిరి గింజలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. వీటితో తయారు చేసిన పొడిని కొబ్బరి నూనెలో కలుపుకుని జుట్టుకు పెట్టుకుంటే తెల్లవెంట్రకలు రావు.
ఉసిరిగింజల పొడిని పెరుగులో కలిపి జుట్టుకు మాస్క్ గా పెట్టుకుంటే జుట్టు వేగంగా పెరుగుతుంది.
ఉసిరిలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
వీటిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.చాలా మంది ఉసిరిగింజలను పారేస్తుంటారు. వీటివల్ల ప్రయోజనాలు తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఉసిరిగింజల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యను దూరం చేయడంలో ఎంతో మేలు చేస్తుంది.
ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఉసిరి గింజలను ఆహారంలో చేర్చుకుంటే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి.
ఉసిరి గింజలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఉసిరి గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ముఖంపై ముడతలను తొలగించడంలో సహాయపడతాయి.