పిల్లలు బరువు పెరగాలా? అయితే ఈ ఫుడ్స్ ఇవ్వండి

పాలు, పెరుగు, చీజ్ వంటి ఆరోగ్యకరమైన పదార్ధాలు పిల్లలు బరువు పెరిగేందుకు సహాయపడతాయి. ఇందులో అవసరమైన కొవ్వులు, కాల్షియం, ప్రొటీన్స్ ఉంటాయి.
బాదం, వాల్నట్స్, వేరుశనగ, వెన్న లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.
అవకాడోలు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొవ్వులు, పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
స్వీట్ పొటాటోలో కార్బొహైడ్రేట్లు అధిక మోతాదులో ఉంటాయి. విటమిన్లు, ఫైబర్ ఉండటం వల్ల బరువు పెరుగటకు ప్రోత్సహిస్తుంది.
గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లలేకాదు పెద్దవాళ్లు కూడా రోజుకో గుడ్డు తినాలి. ఇందులో పిల్లల కండరాల పెరుగుదలకు తోడ్పడే ప్రొటీన్స్ ఉంటాయి.
సమతుల్య ఆహారంతోపాటు పిల్లలకు కావాల్సిన పోషకాలన్నీ అందేలా చూడాలి.
పిల్లల్లో ఇమ్యూనిటీ బాగుంటే ఆరోగ్యంగా ఉంటారు. అధిక పోషకాలు ఉన్న పండ్లు, కూరగాయలు కూడా డైట్లో చేర్చాలి.
చికెన్ లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. సాల్మన్ చేపల్లో కూడా ఒమేగా 3 ఉంటుంది. ఇది పిల్లలకు జ్నాపకశక్తిని పెంచేలా చేస్తుంది.
ఏదైనా కొత్త ఫుడ్ పిల్లలకు అందించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.