బరువు పెరుగుతారా?:

అతిగా తింటే ఏదైనా ప్రమాదమే. కానీ, నెయ్యిలో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ ఆసిడ్స్ శరీరంలో త్వరగా కరిగి శక్తినిస్తాయి. ఇది మెటబాలిజాన్ని పెంచి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్:
నెయ్యిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‎ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‎ను పెంచుతాయి. పరిమితంగా తీసుకుంటే గుండెకు ఇది ఎంతో మేలు.
జీర్ణక్రియ మెరుగుదల:
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం ఉన్నవారికి నెయ్యి ఒక దివ్యౌషధం.
ఖాళీ కడుపుతో నెయ్యి:
ఉదయాన్నే ఒక స్పూన్ నెయ్యి గోరువెచ్చని నీటితో తీసుకుంటే శరీరంలోని విషతుల్యాలు బయటకు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
పిల్లలకు, గర్భిణీలకు:
పిల్లల మెదడు అభివృద్ధికి, ఎముకల పుష్టికి నెయ్యి తప్పనిసరి. గర్భిణీలు నెయ్యి తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దక్కుతుంది.
షుగర్ పేషెంట్లు:
మధుమేహం ఉన్నవారు అన్నం లేదా చపాతీలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు.
నెయ్యి vs నూనె:
రిఫైన్డ్ నూనెల కంటే నెయ్యి చాలా ఉత్తమం. నెయ్యి స్మోక్ పాయింట్ ఎక్కువ, కాబట్టి వేడి చేసినప్పుడు ఇది విషపూరిత పదార్థాలను విడుదల చేయదు.
మోతాదు:
ఆరోగ్యవంతులు రోజుకు 1 నుంచి 2 టీస్పూన్ల నెయ్యిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.