Garlic Health Benefits: ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 2 వెల్లుల్లి రెబ్బలు తింటే ఏమౌతుంది

వెల్లుల్లిలో పోషకాలు అధికంగా ఉంటాయి. కార్బొహైడ్రేట్లు, కాపర్, ఫాస్పరస్, ప్రొటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్లు, మాంగనీస్, కాల్షియం, సెలీలనం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి .
వెల్లుల్లి లేని భారతీయ వంటకాలు ఊహించుకోలేము. వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది.
ప్రతిరోజు ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో 2 వెల్లుల్లి రెబ్బలు తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. పచ్చి వెల్లుల్లిని తింటే నోటి ఆరోగ్యం బాగుంటుంది.
వెల్లుల్లిలో డయల్ డైసల్పైడ్ వంటియాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి.
వెల్లుల్లిని కొబ్బరి నూనెలో వేడి చేసి తలకు మర్దన చేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అంతేకాదు జుట్టుకు కూడా మేలు చేస్తుంది.
వెల్లుల్లి ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుంటే క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. షుగర్ తీవ్రత, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.