ఈ వినాయక చవితికి ఫేమస్ గణపతి ఆలయాలను సందర్శించండి

వినాయక చవితిని గణేష్ చతుర్థి లేదా గణేష్ ఉత్సవం అని కూడా పిలుస్తుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితిని జరుపుకోనున్నారు.
సెప్టెంబర్ 17వ తేదీన వినాయక నిమజ్జనం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో కూడా ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ వినాయక చవితికి ఈ ఫేమస్ వినాయకుడి ఆలయాలను సందర్శించాలనుకుంటున్నారా. అయితే ఈ ఆలయాల గురించి ఓ సారి తెలుసుకోండి.
పూణేలో ఉన్న లాలో బాగ్చా రాజా ఆలయంలో గణేష్ విగ్రహం ఎంతో ప్రత్యేకమైంది. విలువైన ఆభరణాలతో ఆలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయంలో వినాయకుడిని చూడగానే భక్తితో పరవశించిపోతారు.
ముంబైలోని సిద్దివినాయక ఆలయం చాలా ఫేమస్. దేశంలోని అత్యంత ప్రసిద్ధ వినాయక దేవాలయాల్లో ఇది ఒకటి. ముంబై వెళ్తే ఈ ఆలయాన్ని సందర్శించడం మర్చిపోకండి.
పూణేలో మరొక గణేష్ ఆలయం దగ్దుషేత్ హాల్వాయి. ఈ ఆలయంలో వినాయకుడు 7.5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో కొలువై ఉన్నాడు,
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాక వినాయక దేవాలయం చాలా ఫేమస్. 11 వ శతాబ్దంలో చోళులు ఈ ఆలయాన్ని నిర్మించారు.
తిరుచిరాపల్లిలో ఉన్న ఉచ్చి పిళ్లయార్ ఆలయం పల్లవులు రాతితో చెక్కారు. ఈ ఆలయాన్ని ఏట వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు.