రోగనిరోధక శక్తి :

నారింజలో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
మెరిసే చర్మం :
ఇందులోని విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా వేసవి ఎండల వల్ల చర్మం కమిలిపోకుండా కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది.
తక్షణ శక్తి :
ఎండ వల్ల వచ్చే నీరసాన్ని తగ్గించడంలో ఆరెంజ్ జ్యూస్ మేటి. ఇందులోని సహజ చక్కెరలు, ఎలక్ట్రోలైట్స్ మీకు వెంటనే రీఛార్జ్ అయిన అనుభూతిని ఇస్తాయి.
గుండెకు మేలు :
నారింజ రసం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది.
కిడ్నీలో రాళ్లు :
ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే సిట్రేట్.. మూత్రపిండాల్లో కాల్షియం ఆక్సలేట్ పేరుకుపోకుండా చేసి, రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి :
ఇందులో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది ఆకలిని నియంత్రించి బరువు తగ్గాలనుకునే వారికి మంచి డైట్‌గా ఉపయోగపడుతుంది.
జీర్ణక్రియ మెరుగు :
ఇందులోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. వేసవిలో వచ్చే మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను ఇది దూరం చేస్తుంది.