మెంతులు.. ఆరోగ్య ప్రయోజనాలు!

మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మహిళలకైతే మరీ మంచిదని, రోజూ తీసుకుంటే ఎంతో ఉపయోగమంటున్నారు నిపుణులు.
బాలింతలకు మెంతులు, మెంతికూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది.
గర్భిణులకు ప్రసవాన్ని సులభతరం చేస్తుంది. ప్రసవం తర్వాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవుతుంది.
మెంతులతో గర్భాశయ వ్యాధులు తగ్గుతాయని పలు రీసెర్చ్‌లు చెబుతున్నాయి.
కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజుకి 10 నుంచి 20 గ్రాముల మెంతులను నీళ్లలో లేదా మజ్జిగలో కలిపి తీసుకుంటే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
మధుమేహంతో బాధపడేవారు మెంతుల్ని రోజుకి 3 సార్లు తీసుకుంటే డయాబెటిస్‌ అదుపులోకి వస్తుంది.
మలబద్ధకం ఉన్నప్పుడు 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.
మెంతులు, తేనె, నిమ్మరసం కలిపి కషాయంలా తాగితే జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే గొంతు సంబంధిత సమస్యలను నివారిస్తుంది.