ప్రస్తుతం కాలుష్యం వల్ల జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. ముఖ్యంగా దుమ్ము ధూళి పొగ వంటివి మీ వెంట్రుకలను బలహీనంగా చేస్తున్నాయి. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కోడి గుడ్డుతో హెయిర్ మాస్క్ చక్కటి రెమిడిగా చెబుతున్నారు.
కోడిగుడ్డు హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో దీన్ని ఎలా తలకు అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
ముందుగా జుట్టును కొద్దిగా తడి చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా తడి చేసుకోకూడదు. కొద్దిగా మాత్రమే తడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కోడిగుడ్లను పగలగొట్టి సొనలను బాగా ఒక చెంచాతో గిలకొట్టుకోవాలి. ఇందులో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని మీ తలకు లేయర్స్ లాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు అప్లై చేసిన తర్వాత మీ కుదుళ్లకు కూడా కోడి గుడ్డు సొనను బాగా పట్టించాల్సి ఉంటుంది.
ఇప్పుడు మీ తల పైన ఒక పాలిథిన్ కవర్ను పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా ఒక గంట సేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత పాలిథిన్ కవర్ తీసివేయాలి
అనంతరం మరో అరగంట పాటు కవర్ లేకుండా ఒక గదిలో కూర్చోవాల్సి ఉంటుంది. వీలైతే ఫ్యాన్ వేసుకుంటే మంచిది. ఇప్పుడు జుట్టు ఆరిన తర్వాత తలను కడుక్కునేందుకు వెళ్తే మంచిది.
ఇప్పుడు మీరు జుట్టును కడుక్కోవచ్చు. జుట్టు కడిగిన అనంతరం కొన్ని చుక్కల కొబ్బరినూనెను తలకు అప్లై చేసుకోవాలి. ఇది సహజమైన మాయిశ్చరైసర్ గా ఉపయోగపడుతుంది.
తలకు కోడిగుడ్డు పెట్టడం వల్ల మీ వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా మారుతాయి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మీ వెంట్రుకలను బలంగా మారుస్తాయి.
కోడిగుడ్డు సోనాలో సీరం ఉంటుంది. ఇది మీ వెంట్రుకలను కాంతివంతంగా చేసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మీ వెంట్రుకలు కుదుళ్ళ నుంచి దృఢంగా మారుతాయి.