బ్లూబెర్రీస్ తింటే గుండె జబ్బులు రావా?

పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు
బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి మీ శరీరాన్ని కాపాడటంలో సహాయపడతాయి.
గుండె ఆరోగ్యం
రక్తపోటును తగ్గించడంలో బ్లూబెర్రీస్ సహాపడతాయి. రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
మెదడు పనితీరు
బ్లూబెర్రీస్ లోని యాంటీఆక్సిడెంట్లు మెదడు, వ్రుద్ధప్యాన్ని నెమ్మదిస్తాయి. జ్నాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
జీర్ణవ్యవస్థ
బ్లూబెర్రీస్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
బలమైన రోగనిరోధక వ్యవస్థ
బ్లూబెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతుంది.
చర్మ ఆరోగ్యం
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని అకాల వ్రుద్ధాప్యం నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
క్యాన్సర్ నివారణలో
బ్లూబెర్రీస్ లో ఉండే ఆంథో సైనిన్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్న ఇతర సమ్మేళనాలను కూడా కలిగి ఉంటాయి.
బరువు తగ్గడంలో
బ్లూబెర్రీస్ లో తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. బరువు తగ్గుతారు.