శీతాకాలంలో మానసిక సమస్యలను దూరం చేస్తాయ్‌.. ఈ పండ్లను రోజూ తినండి..!

శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల చలికాలంలో డిప్రెషన్‌కు గురవుతుంటారు. విటమిన్ డి అధికంగా ఉండే పండ్లను ప్రతి రోజూ తినండి.
ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నారింజలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అలాగే సెరోటోనిన్‌ను పెంచడంలో సహాయపడతాయి.
చలికాలంలో సాధారణంగా లభించే పండు, కివీలో విటమిన్ సి, ఐరన్, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు వంటి వివిధ పోషకాలు ఉంటాయి.
అరటిపండు శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అరటిపండ్లలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది
యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు, ఇంకా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.