Thyroid : థైరాయిడ్ సమస్య ఉందా? ఈ పండ్లు తినండి

థైరాయిడ్ సమస్యలకు మందులు తప్పా మరో మార్గం లేదు. థైరాయిడ్ హార్మోన్ స్రావం, పనితీరు మందులతో తగ్గించుకోవచ్చు.
కానీ థైరాయిడ్ సంబంధిత సమస్యలన్నీ మందులు వేసుకోవడం వల్ల వెంటనే తగ్గే ప్రమాదం ఉండదు.
థైరాయిడ్ రోగులు ప్రతిరోజూ కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి. ముఖ్యమైన కొన్ని పండ్లను డైట్లో చేర్చుకుంటే ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.
బెర్రీలు థైరాయిడ్ సమస్యను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రత్యేక పాత్ర పోషిస్తుంటాయి. బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, కాన్బెర్రీలు శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లలోపాన్ని తీర్చుతాయి.
యాపిల్స్ లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. యాపిల్ థైరాయిడ్ గ్రంథిని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది.
అవకాడోలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ కె, ఫొలెట్, విటమిన్ సి, పొటాషియం,విటమిన్ బి5,బి6, ఇ వంటి పోషకాలు ఉన్నాయి. థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవకాడోలు సహాయపడతాయి.
అరటిపండు రోజూ తింటే థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది.
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. సూపర్ ఫుడ్ అయిన ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం థైరాయిడ్ ఆరోగ్యానికి శక్తివంతమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
కాలీఫ్లవర్, క్యాబేజీ , బ్రోకలీ. క్యారెట్, గుమ్మడికాయ, స్క్వాష్, దోసకాయ, పుట్టగొడుగులు, పాలకూర, కాలే, ఆవాలు ఉల్లిపాయ,మెంతి ఆకులు, కొత్తిమీర, డైట్లో చేర్చుకోవాలి.