జ్యూసుల్లో అవసరమైన పోషకాలు ఉంటాయి. మీ దాహాన్ని తీర్చడంతోపాటు రిఫ్రెష్ ను అందిస్తాయి. అయితే తక్కువ చక్కెరతో ఈ జ్యూసులు తాగవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు కొన్ని రకాల జ్యూసులు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలంటే ఎలాంటి జ్యూసులు తాగాలో ఇప్పుడు చూద్దాం.
బీట్రూట్ జ్యూస్ లో డైటరీ నైట్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి బీట్రూట్ జ్యూస్ మంచి ఎంపిక.
పుచ్చకాయ జ్యూస్ తియ్యగా, రిఫ్రెష్ అందిస్తుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి.
సెలెరీ జ్యూసు చాలా మందికి నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 95శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలో మంటను తగ్గించి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
క్యారెట్ జ్యూస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ తో పాటు కెరోటినాయిడ్స్ ఉన్నాయి. ఇది బరువు తగ్గించడంతోపాటు ఆకలిని నియంత్రిస్తుంది.
కాలే, బచ్చలికూర, క్యాబేజీ వంటి కూరగాయలతో తయారు చేసిన గ్రీన్ జ్యూసులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో చక్కర తక్కువగా ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాంటీఆక్సిడెంట్లు అధికమోతాదులు ఉన్నాయి. ఇవి బరువు తగ్గడంలో సమాయపడతాయి.
నిమ్మకాయ, అల్లం జ్యూస్ బరువు తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. అల్లం జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు సులభంగా ఉంటుంది.
దానిమ్మ జ్యూస్ రుచికరంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఎంపిక. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దానిమ్మ జ్యూస్ తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి