ఒక గాడిద రోజుకు కేవలం 1 నుంచి 1.5 లీటర్ల పాలు మాత్రమే ఇస్తుంది. ఆవు, గేదెలతో పోలిస్తే దిగుబడి చాలా తక్కువ కావడంతో దీనికి విపరీతమైన డిమాండ్, ధర ఉన్నాయి.
తల్లి పాలతో సమానం
గాడిద పాలలోని పోషకాలు ఇంచుమించు మానవ తల్లి పాలలోని పోషకాలకు సమానంగా ఉంటాయి. అందుకే నవజాత శిశువులకు ఇవి శ్రేష్టమైనవిగా భావిస్తారు.
పోషకాల గని
ఇందులో విటమిన్ A, C, D, E తో పాటు B-6, B-12 పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎముకల పుష్టికి తోడ్పడతాయి.
జీర్ణక్రియకు మేలు
ఆవు పాలతో పోలిస్తే ఇందులో కేసిన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల పాలు త్వరగా అరుగుతాయి. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉండటం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు.
చర్మ సౌందర్యం
ప్రాచీన కాలంలో ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా తన చర్మ సౌందర్యం కోసం గాడిద పాలతో స్నానం చేసేదట. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి మరియు వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి.
రోగనిరోధక శక్తి
గాడిద పాలలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. ఆస్తమా, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల ఉపశమనానికి ఇవి దివ్యౌషధంగా పనిచేస్తాయి.