కెఫీన్ ప్రభావం

టీలోని కెఫీన్ మూత్రం ద్వారా కాల్షియం బయటకు వెళ్లడాన్ని కొద్దిగా పెంచుతుంది, కానీ పరిమితంగా తాగితే పెద్దగా ముప్పు ఉండదు.
మితంగా తాగడం మంచిది:
రోజుకు 1 నుండి 2 కప్పుల టీ తాగడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలో గణనీయమైన మార్పులేవీ రావు.
ఆహారంలో కాల్షియం ముఖ్యం:
రోజువారీ ఆహారంలో కాల్షియం తక్కువగా ఉండి, టీ ఎక్కువగా తాగే వారికి ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పోషకాహారం అవసరం:
ఎముకల ఆరోగ్యం కోసం పాలు, పెరుగు, జున్ను, జొన్నలు, నువ్వులు, ఆకుకూరలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
విటమిన్ డి ప్రాముఖ్యత:
కాల్షియం శరీరం సరిగ్గా గ్రహించాలంటే కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా చాలా అవసరం.
నిద్రలేమి సమస్యలు:
సాయంత్రం లేదా రాత్రి వేళల్లో టీ ఎక్కువగా తాగితే కెఫీన్ ప్రభావం వల్ల నిద్ర భంగం కలిగే అవకాశం ఉంది.
ఖాళీ కడుపుతో టీ వద్దమ్మా:
పరగడుపున టీ తాగడం వల్ల కొందరిలో అసిడిటీ, గ్యాస్ట్రిక్ లేదా గుండెల్లో మంట వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
భోజనం తర్వాత విరామం:
టీలోని టానిన్లు ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. కాబట్టి భోజనం చేసిన వెంటనే టీ తాగకూడదు.
చక్కెర పరిమాణం తగ్గించండి:
టీలో ఎక్కువగా చక్కెర వేసుకోవడం వల్ల కేలరీలు పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది.
టీ పూర్తిగా మానేయక్కర్లేదు:
మితంగా టీ తాగుతూ, సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.