కోడిగుడ్డు హెయిర్ ప్యాక్ తో జుట్టు బలంగా మారుతుందా..? ఎలా అప్లై చేసుకోవాలి..?

మీ వెంట్రుకలు జీవం లేకుండా కాంతి విహినంగా మారుతున్నాయి అయితే ఒక చిట్కా మీకోసం
కోడిగుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ఆల్బమ్ ఇండ్లు అదే విధంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి.
ఎవరైతే తమ వెంట్రుకలు బలహీనంగా ఉన్నాయని భావిస్తారో వారికి కోడిగుడ్డు హెయిర్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది.
పచ్చి కోడిగుడ్డు పగలగొట్టి సొనను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీ వెంట్రుకల పరిమాణాన్ని బట్టి కోడిగుడ్డులను వాడాల్సి ఉంటుంది.
ఇప్పుడు పచ్చి కోడిగుడ్డు సోనాను బాగా గిల కొట్టి మీ వెంట్రుకలకు నెమ్మదిగా అప్లై చేసుకోవాలి కుదుర్ల నుంచి వెంట్రుకల చివరి వరకు కోడిగుడ్డు సొనను అప్లై చేసుకోవాలి.
కోడిగుడ్డు సోన లోపల అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. ఇవి మీ వెంట్రుకల చివర్లు చిట్లిపోయినప్పుడు అవి బలంగా మారేలా చేస్తాయి.
కోడిగుడ్డు సోనా హెయిర్ ప్యాక్ అనంతరం మంచినీటితో తలస్నానం చేయాలి.
కోడిగుడ్డు హెయిర్ ప్యాక్ అనంతరం మీ వెంట్రుకలు సిల్కీ గాను కాంతివంతంగాను మారే అవకాశం ఉంటుంది.
కోడిగుడ్డు సొన హెయిర్ ప్యాక్ వారానికి ఒకసారి పెట్టుకోవచ్చు. హెయిర్ ప్యాక్ అనంతరం కొబ్బరి నూనె తలకు రాసుకుంటే సహజ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది.
కోడిగుడ్డు వాసన మీకు ఇష్టం లేకపోతే కేవలం తెల్ల సొనను తలకు పెట్టుకోవచ్చు