భారతీయులు ఏడాదికి ఎన్ని కిలోల పిజ్జా తింటున్నారో తెలుస్తే షాక్ అవుతారు

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రపంచ జనాభా సమీక్షను ఉటంకిస్తూ..పిజ్జా వినియోగం ఏ దేశాల్లో ఎక్కువగా ఉందో ర్యాంకింగ్ రిలీజ్ చేసింది.
పిజ్జా ఎక్కువగా వినియోగించే దేశాల్లో నార్వే అగ్రస్థానంలో ఉంది. ఒక వ్యక్తి ఏడాదికి 11.4 కిలోల పిజ్జా తింటాడట.
9.6 కిలోలతో అమెరికా రెండో స్థానంలో ఉంది.
మూడో స్థానంలో కెనడా ఉండగా..అక్కడ వార్షిక తలసరి పిజ్జా వినియోగం 8.9కిలోలు.
తర్వాత ఆస్ట్రేలియా 8.6కిలోలు. ఇటలీ 7.6కిలోలు. స్విట్జర్లాండ్ 7.5 కిలోలు, ఫ్రాన్స్ 6.8కిలోలు.
జపాన్ లో వార్షిక తలసరి పిజ్జా వినియోగం 5.6 కిలోలు. రష్యాలో 5.4కిలోలు, డెన్మార్క్ 5.1 కిలోలు, ఐర్లాండ్ 4.6 కిలోలు తింటారు.
చైనాలో తక్కువగా 3.2 కిలోలు ఉంది. రొమేనియాలో 3.6 న్యూజిలాండ్ 3.9కిలోలు, దక్షిణ కొరియాలో 3.8కిలోలు.
భారత దేశంలో వార్షిక తలసరి పిజ్జా వినియోగం 1.3కిలోలుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది.