జిమ్ నువ్వు చేస్తుంటే.. చెమటలు మాకు పడుతున్నాయ్ ఏంటి..!
జిమ్‌లో పట్టుదల:
ట్రెండీ జిమ్ వేర్‌లో వర్కౌట్ మధ్యలో దివి వాద్త్యా దిగిన లేటెస్ట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టోన్డ్ ఫిజిక్:
నల్లటి ట్యాంక్ టాప్, లేత గోధుమ రంగు షార్ట్స్‌లో ఆమె తన పర్ఫెక్ట్ టోన్డ్ ఫిజిక్‌ను హైలైట్ చేస్తూ ఫిట్‌నెస్ గోల్స్ ఇస్తోంది.
నిబద్ధతకు నిదర్శనం:
ఎంత బిజీ షూటింగ్ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ఫిట్‌నెస్ విషయంలో ఆమె చూపించే ఏకాగ్రత, అంకితభావం అద్భుతం.
పుల్-అప్ బార్ వర్కౌట్:
పూర్తి ఏకాగ్రతతో పుల్-అప్ బార్‌ను పట్టుకుని ఆమె చేస్తున్న కఠినమైన వర్కౌట్ ఆమెలోని స్టామినాను తెలపడమే కాదు, అభిమానులకు పెద్ద స్ఫూర్తి!
బ్యాక్‌గ్రౌండ్
హైదరాబాద్‌కు చెందిన దివి.. ఇంజనీరింగ్ పూర్తి చేసి, 2017లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.
తొలి అడుగులు
2018లో వచ్చిన ‘లెట్స్ గో’ షార్ట్ ఫిల్మ్‌తో నటిగా కెరీర్ ప్రారంభించి, మహేష్ బాబు బ్లాక్‌బస్టర్ ‘మహర్షి’తో సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంది.
బిగ్ బాస్ క్రేజ్
2020లో ప్రసారమైన ‘బిగ్ బాస్ తెలుగు 4’ షో ఆమెకు ప్రేక్షకుల్లో విపరీతమైన పాపులారిటీని, క్రేజ్‌ను సంపాదించిపెట్టింది.
స్టార్ సినిమాలలో ప్రయాణం
‘పుష్ప: ది రైజ్’, ‘గాడ్‌ఫాదర్’, ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, ‘లంబసింగి’, ‘సింబా’, ‘పుష్ప 2: ది రూల్’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషించింది.
రీసెంట్ ప్రాజెక్ట్స్
ఇటీవల ‘డాకు మహారాజ్’ చిత్రంతో పాటు, బాలీవుడ్‌లో సన్నీ డియోల్ నటిస్తున్న ‘జాట్’ చిత్రంలో పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి అలరించింది.